వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి ఎయిర్‌పోర్టు అథారిటీ అనుమతి

వరంగల్‌ నగరంలో 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి లభించింది. వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో రూ.1100 కోట్లతో ఇటీవలనే ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించారు.

Published : 26 May 2022 05:32 IST

ఈనాడు వరంగల్‌-ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: వరంగల్‌ నగరంలో 24 అంతస్తుల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి అనుమతి లభించింది. వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో రూ.1100 కోట్లతో ఇటీవలనే ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇక్కడి నేల స్వభావం, మట్టి గట్టితనంపై పరీక్షలు నిర్వహించిన వరంగల్‌లోని నిట్‌.. ఆసుపత్రి నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. పర్యావరణ, అగ్నిమాపక శాఖల నుంచి కూడా అనుమతులు లభించడంతో పనులు వేగంగా సాగనున్నాయి. వరంగల్‌లో ఇక్కడ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ 2021, జూన్‌ 21న శంకుస్థాపన చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని