న్యాయస్థానాల భవనాలకు భూమి కేటాయింపు

రాష్ట్రంలోని నూతన జిల్లాల్లో న్యాయస్థానాల భవన సముదాయాల నిర్మాణం కోసం భూములను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఉన్న పది జిల్లాలకు అదనంగా 23 జిల్లాలను ప్రభుత్వం

Published : 27 May 2022 04:58 IST

21 జిల్లాల్లో కేటాయిస్తూ ఉత్తర్వుల జారీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నూతన జిల్లాల్లో న్యాయస్థానాల భవన సముదాయాల నిర్మాణం కోసం భూములను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఉన్న పది జిల్లాలకు అదనంగా 23 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మంచిర్యాల, వనపర్తి జిల్లాలు మినహా మిగిలిన కొత్త జిల్లాల్లో న్యాయస్థాన భవనాలు నిర్మించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ 21 జిల్లాల్లో భూమిని గుర్తించి జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఆ మేరకు కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాకు 2.20 ఎకరాలు కేటాయించగా అధిక శాతం జిల్లాలకు పది ఎకరాల చొప్పున కేటాయిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని