Published : 27 May 2022 05:35 IST

ప్రభుత్వాలకు ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం

లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బ్యాంకులు, ప్రజలకు ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యమని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్‌ నారాయణ(జేపీ) వ్యాఖ్యానించారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం పరిధిలో రాష్ట్రాలు 3.5 శాతానికి మించి రుణాలుతెస్తే అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఆర్థికంగా దివాలా తీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.ఒకప్పుడు సంపన్న రాష్ట్రమైన పంజాబ్‌ ప్రస్తుతం ఆర్థికంగా కుదేలైందన్నారు. రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాలూ అదే బాటలో ఉన్నాయన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ఆదాయాలను పెంచి ఆర్థిక రంగాన్ని పటిష్ఠం చేయాలని ప్రభుత్వాలకు జేపీ సూచించారు. గురువారం హైదరాబాద్‌లో ఇండియన్‌ బ్యాంక్‌ రిటైరీస్‌ అసోసియేషన్‌(ఏపీ, తెలంగాణ) 12వ సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జేపీ మాట్లాడుతూ.. మొండి బకాయిలను రాబట్టి బ్యాంకింగ్‌ రంగాన్ని బలోపేతం చేయాలన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేటువే మెరుగైన సేవలందిస్తున్నాయని గుర్తుచేశారు. డబ్బుకు రక్షణ, తగిన వడ్డీ, నాణ్యమైన సేవలు, సకాలంలో రుణాల వసూళ్లతో పాటు అధికంగా డిపాజిట్లను కూడబెట్టే బ్యాంకులే మనుగడ సాధిస్తాయన్నారు. రాజకీయ వ్యవస్థలో అవినీతిని రూపుమాపనంత కాలం ప్రభుత్వరంగ సేవలు మెరుగుపడవన్నారు. అనంతరం.. కొవిడ్‌ సమయంలో బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో పనిచేసిన కాటికాపరులను ఆయన ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఇండియన్‌ బ్యాంక్‌ రిటైరీస్‌ అసోసియేషన్‌ తరఫున సభ్యులు పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. పెన్షన్‌ రివిజన్‌తో పాటు స్పెషల్‌ పే విధానం ఎత్తివేత, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ రిటైరీస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎస్‌ఎం దేశ్‌పాండే, టీబీఆర్‌ఎఫ్‌ అధ్యక్షుడు ఎ.రాజేంద్రప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మణ్‌రావు, ఆయా రాష్ట్రాల సభ్యులు పాల్గొన్నారు.

 

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని