వ్యాగన్‌ వర్క్‌షాప్‌ అంచనా వ్యయం పైపైకి

కాజీపేటలో ఏర్పాటుచేయనున్న పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌ (పీఓహెచ్‌) వ్యాగన్‌ వర్క్‌షాప్‌ ప్రాజెక్టు అంచనా వ్యయం మరోసారి పెరిగింది. వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు ఆలస్యం అవుతుండగా..

Published : 28 May 2022 06:08 IST

మూడు నెలల్లోనే రూ.10 కోట్ల మేర పెరుగుదల
బిడ్ల దాఖలుకు జులై 29 వరకూ అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: కాజీపేటలో ఏర్పాటుచేయనున్న పీరియాడికల్‌ ఓవర్‌ హాలింగ్‌ (పీఓహెచ్‌) వ్యాగన్‌ వర్క్‌షాప్‌ ప్రాజెక్టు అంచనా వ్యయం మరోసారి పెరిగింది. వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు ఆలస్యం అవుతుండగా.. ఆ మేరకు భారమూ పెరుగుతోంది. 2016-17లో ప్రాజెక్టు మంజూరు చేసినప్పుడు అంచనా వ్యయం రూ.270 కోట్లుగా ఉంది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములపై న్యాయ వివాదం తలెత్తడంతో ప్రక్రియ ఆలస్యమైంది. సమస్య పరిష్కారం అయ్యాక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.381.89 కోట్ల అంచనా వ్యయంతో రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌  టెండర్లు పిలిచింది. సాంకేతిక కారణాలతో కొద్దిరోజులకే వాటిని రద్దు చేసి, తాజాగా మరోసారి టెండర్లు ఆహ్వానించింది. ఈసారి అంచనా వ్యయం రూ.392 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తితో ఉన్న గుత్తేదారులతో ఆర్‌వీఎన్‌ఎల్‌ శుక్రవారం దిల్లీలో ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించింది. తొమ్మిది సంస్థలు పాల్గొన్నాయి. జూన్‌ 16న మరోసారి సమావేశం నిర్వహించనున్నారు. బిడ్ల దాఖలుకు జులై 29 వరకు రైల్వేశాఖ అవకాశం కల్పించింది. ఈ బడ్జెట్‌లో వర్క్‌షాప్‌నకు కేంద్రం రూ.45 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని