జమ్ము కశ్మీర్‌లో క్షేత్ర విద్యాసంస్థలు..

జమ్ము కశ్మీర్‌లో క్షేత్ర విద్యాసంస్థలను నెలకొల్పడానికిగాను శుక్రవారం కశ్మీర్‌లోని పహల్‌గాంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి డా.అజయ్‌కుమార్‌ మిశ్రా, హోంమంత్రిత్వ శాఖ డైరెక్టర్‌(పోలీస్‌) అనంతకిశోర్‌శరణ్‌

Published : 28 May 2022 06:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: జమ్ము కశ్మీర్‌లో క్షేత్ర విద్యాసంస్థలను నెలకొల్పడానికిగాను శుక్రవారం కశ్మీర్‌లోని పహల్‌గాంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి డా.అజయ్‌కుమార్‌ మిశ్రా, హోంమంత్రిత్వ శాఖ డైరెక్టర్‌(పోలీస్‌) అనంతకిశోర్‌శరణ్‌ను కలిసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. శ్రీగాయత్రి విద్యాసంస్థల వ్యవస్థాపకులు పి.వి.ఆర్‌.కె.మూర్తి, పారమిత విద్యాసంస్థల వ్యవస్థాపకులు డా.ఇ.ప్రసాద్‌రావు, ఒయాసిస్‌ విద్యాసంస్థల వ్యవస్థాపకులు డా.జె.ఎస్‌.పరంజ్యోతి సంయుక్తంగా నిర్వహిస్తున్న క్షేత్ర విద్యాసంస్థలను జమ్ము కశ్మీర్‌లో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి వివరించినట్లు పేర్కొన్నారు. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పి.వి.ఆర్‌.కె.మూర్తికి కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారని తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని