మూడు రోజుల్లో కేరళకు ‘నైరుతి’

నైరుతి రుతుపవనాలు రెండు, మూడు రోజుల్లో కేరళలో ప్రవేశించడానికి అనుకూల వాతావరణం ఏర్పడినట్లు వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. కేరళకు వచ్చిన వారం, పది రోజుల్లో తెలంగాణలోకి వస్తాయి.

Published : 28 May 2022 06:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు రెండు, మూడు రోజుల్లో కేరళలో ప్రవేశించడానికి అనుకూల వాతావరణం ఏర్పడినట్లు వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. కేరళకు వచ్చిన వారం, పది రోజుల్లో తెలంగాణలోకి వస్తాయి. శుక్రవారం నాటికి అరేబియా సముద్రంలోని దక్షిణ ప్రాంతం, మాల్దీవులు, లక్షదీవుల వరకూ రుతుపవనాలు విస్తరించాయి. పశ్చిమ గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నందున రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు రావడానికి అనుకూల వాతావరణం ఉంది. శని, ఆదివారాల్లో తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కి చెందిన పడిగె లత(40), పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మూర్ముర్‌కు చెందిన నువ్వుల గట్టమ్మ(60) అనే ఉపాధి హామీ కూలీలు శుక్రవారం పనులు చేస్తుండగా వడదెబ్బతో మృతిచెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు