జులై 4 నుంచి అంబేడ్కర్‌ వర్సిటీ పీజీ పరీక్షలు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ పీజీ పరీక్షలు జులై 4 నుంచి ప్రారంభమవనున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.

Published : 28 May 2022 06:14 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ పీజీ పరీక్షలు జులై 4 నుంచి ప్రారంభమవనున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఎంఏ(ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, ఆంగ్లం, తెలుగు, హిందీ, ఉర్దూ, మాస్‌ కమ్యూనికేషన్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌), ఎంకాం, ఎమ్మెస్సీ(మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌), ఎంబీఏ, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌(ఎంఎల్‌ఐఎస్సీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌(బీఎల్‌ఐఎస్సీ)లతో పాటు అన్ని డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులు పూర్తి వివరాలకు ‌www.braouonline.in పోర్టల్‌ను చూడాలని, పరీక్షల ప్రారంభానికి రెండు రోజుల ముందు పోర్టల్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. అన్ని కోర్సుల పరీక్షల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి జూన్‌ 14 చివరి తేదీ అని పేర్కొన్నారు.

సీయూఈటీ దరఖాస్తు గడువు పెంపు
కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు(సీయూఈటీ- యూజీ) దరఖాస్తు గడువును  ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు యూజీసీ ఛైర్మన్‌ ఆచార్య ఎం.జగదీష్‌ కుమార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని