హైదరాబాద్‌లో అత్యధికం.. ములుగులో అత్యల్పం

తెలంగాణలో పోలీస్‌ పోస్టులకు డిమాండ్‌ కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) జారీ చేసిన నోటిఫికేషన్లకు దరఖాస్తులు అంచనాలకు మించి రికార్డుస్థాయిలో పోటెత్తడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రం

Published : 29 May 2022 06:08 IST

పోలీసు పోస్టులకు దరఖాస్తుల్లో..

కానిస్టేబుల్‌ పోస్టులే ఎక్కువ కావడంతో జిల్లాలవారీగా దరఖాస్తులపై అభ్యర్థుల్లో ఆసక్తి

ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణలో పోలీస్‌ పోస్టులకు డిమాండ్‌ కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) జారీ చేసిన నోటిఫికేషన్లకు దరఖాస్తులు అంచనాలకు మించి రికార్డుస్థాయిలో పోటెత్తడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రం ఏర్పడ్డాక 2016, 2018ల్లో వెలువడిన నోటిఫికేషన్లతో పోల్చితే ఈసారి దరఖాస్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. 2018లో ఇప్పటికంటే ఎక్కువ పోస్టులే ఉన్నా.. ఈసారి అంతకంటే 80శాతం అధికంగా దరఖాస్తులు రావడం విశేషం. ఈసారి అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 1,03,806.. అత్యల్పంగా ములుగు జిల్లాలో 12,344 నమోదయ్యాయి. ప్రస్తుత నోటిఫికేషన్లలో భర్తీ కానున్న 17,516 పోస్టుల్లో కానిస్టేబుళ్లవే 16,929 కావడం.. ఈ పోస్టులు జిల్లా కేడర్‌వే కావడంతో జిల్లాలవారీగా దరఖాస్తుల సంఖ్యపై అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. తమ జిల్లాలోని పోస్టులు.. నమోదైన దరఖాస్తులను బట్టి పోటీ ఎలా ఉండబోతోందనే అంచనాల్లో నిమగ్నమయ్యారు.

ఇతర రాష్ట్రాల నుంచి 46,425 దరఖాస్తులు

ఈసారి ఇతర రాష్ట్రాల నుంచీ   దరఖాస్తులు పోటెత్తాయి. రాష్ట్రపత్తి కొత్త ఉత్తర్వుల ప్రకారం నాన్‌లోకల్‌ కోటా 5 శాతం కాగా 46,425 దరఖాస్తులొచ్చాయి.

పోలీస్‌ యూనిట్ల వారీగా సివిల్‌, ఏఆర్‌ విభాగాల్లో భర్తీ కానున్న పోస్టులిలా..

హైదరాబాద్‌ - 1,918, సైబరాబాద్‌ - 451, రాచకొండ - 850, వరంగల్‌ - 666, రామగుండం - 440, నిజామాబాద్‌ - 640, కరీంనగర్‌ - 413, సిద్దిపేట - 212,  ఖమ్మం - 191, ఆసిఫాబాద్‌ - 182, భూపాలపల్లి - 66, ములుగు - 68, ఆదిలాబాద్‌ - 234, జగిత్యాల - 123, నిర్మల్‌ - 158, కామారెడ్డి - 240, మెదక్‌ - 179,  సిరిసిల్ల - 142, కొత్తగూడెం - 102, మహబూబాబాద్‌ - 170, నల్గొండ - 464, సూర్యాపేట - 320, సంగారెడ్డి - 545, వికారాబాద్‌ - 107, గద్వాల - 118, మహబూబ్‌నగర్‌ - 202, నాగర్‌కర్నూల్‌ - 195, నారాయణపేట - 100, వనపర్తి - 131.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని