పదవీ విరమణ ప్రోత్సాహం పెంపు ఎప్పటికో?

అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బంది పదవీ విరమణ ప్రోత్సాహం పెంపునకు ఎదురుచూస్తున్నారు. ఇపుడిస్తున్న మొత్తాన్ని పెంచేందుకు మహిళా శిశుసంక్షేమ శాఖ సిద్ధం చేసిన దస్త్రం నెలలుగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.

Published : 29 May 2022 05:16 IST

అంగన్‌వాడీ సిబ్బంది ఎదురుచూపు

ఈనాడు, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బంది పదవీ విరమణ ప్రోత్సాహం పెంపునకు ఎదురుచూస్తున్నారు. ఇపుడిస్తున్న మొత్తాన్ని పెంచేందుకు మహిళా శిశుసంక్షేమ శాఖ సిద్ధం చేసిన దస్త్రం నెలలుగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. అంగన్‌వాడీ సిబ్బంది గ్రాట్యుటీకి అర్హులని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో.. కేంద్ర ప్రభుత్వం నుంచి విధివిధానాల కోసం రాష్ట్ర అధికారులు ఎదురుచూస్తున్నారు. అంగన్‌వాడీల్లో ప్రస్తుతం 70వేల మంది టీచర్లు, వర్కర్లు  పనిచేస్తున్నారు. 60ఏళ్లు దాటినవారు వృద్ధాప్యం కారణంగా స్వచ్ఛందంగా పదవీవిరమణ చేస్తే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. టీచర్లకు రూ.60 వేలు, వర్కర్లకు రూ.30వేలు ఇస్తోంది. ఈ మొత్తంతో విశ్రాంత జీవితం గడపడం కష్టమవుతుందని సిబ్బంది మహిళాశిశు సంక్షేమశాఖ దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో మంత్రి ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ ఆయా మొత్తాలను పెంచుతూ ప్రభుత్వానికి దస్త్రం పంపినా నేటికీ నిర్ణయం వెలువడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు