ఎంసెట్‌కు భారీగా దరఖాస్తులు

ఎంసెట్‌పై విద్యార్థుల ఆసక్తి ఏటేటా పెరుగుతోంది. కొన్నేళ్లతో పోల్చుకుంటే గత సంవత్సరం దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగగా... ఈసారి మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఎంసెట్‌కు 2,51,604 మంది దరఖాస్తు చేయగా...

Updated : 29 May 2022 05:36 IST

ఈనాడు, హైదరాబాద్‌:  ఎంసెట్‌పై విద్యార్థుల ఆసక్తి ఏటేటా పెరుగుతోంది. కొన్నేళ్లతో పోల్చుకుంటే గత సంవత్సరం దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగగా... ఈసారి మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఎంసెట్‌కు 2,51,604 మంది దరఖాస్తు చేయగా... ఈసారి ఇప్పటివరకు 2,49,708 మంది ముందుకొచ్చారు. అగ్రికల్చర్‌ విభాగానికి గత ఏడాది 86,641 మంది ఆసక్తి చూపగా... ఈసారి 88,156 మంది దరఖాస్తు చేశారు. ఎంసెట్‌కు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు గడువు శనివారంతో ముగిసింది.  రూ.250 నుంచి రూ.5 వేల ఆలస్య రుసుంతో జులై 7 వరకు గడువుంది.  బీటెక్‌ చేస్తే ఐటీ కొలువు దొరుకుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. విదేశాలకు వెళ్లి ఎంఎస్‌ చేయడం సులభతరమవుతుందని భావించి ఇంజినీరింగ్‌ వైపు మొగ్గుచూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అగ్రికల్చర్‌ విభాగంలో సీట్లు తక్కువగా ఉన్నా ఇంటర్‌ బైపీసీ గ్రూపు చదివిన వారు దరఖాస్తు చేసి తమ విద్యా సామర్ధ్యాన్ని పరీక్షించుకుంటున్నారని చెబుతున్నారు. ‘గత ఏడాది ఇంటర్‌లో అందర్నీ పాస్‌ చేయడంతో ఎంసెట్‌కు భారీగా దరఖాస్తు చేశారు. కాకపోతే బీటెక్‌లో చేరే వారి సంఖ్యలో మాత్రం పెద్దగా మార్పు ఉండటం లేదు’ అని నానో అకాడమీ సంచాలకుడు కృష్ణచైతన్య అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని