మాంసం ఉత్పత్తిలో అంతర్జాతీయ స్థాయికి చేరాలి

మాంసం ఉత్పత్తిలో అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మాంసం ఉత్పత్తులపై పరిశోధనలు మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

Published : 29 May 2022 05:16 IST

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌, బోడుప్పల్‌, న్యూస్‌టుడే: మాంసం ఉత్పత్తిలో అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మాంసం ఉత్పత్తులపై పరిశోధనలు మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వనపర్తి గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం ప్రతినిధులు, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి శనివారం ఆయన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా చెంగిచర్లలోని జాతీయ మాంసం పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని పరికరాలను మంత్రి పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రంలో 2 కోట్ల గొర్రెలు ఉన్నాయని, దేశంలో ఎక్కువ జీవాలున్న ప్రాంతం తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని