Published : 29 May 2022 08:35 IST

ఎస్‌ఆర్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ తర్వాత నేరుగా పీహెచ్‌డీ అవకాశం

హసన్‌పర్తి, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌ శివారులోని ఎస్‌ఆర్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశం కల్పిస్తున్నామని వర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్‌ జి.ఆర్‌.సి.రెడ్డి తెలిపారు. విశ్వవిద్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. 2022-23 విద్యాసంవత్సరంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేసినవారితో పాటు నాలుగు సంవత్సరాలు బీటెక్‌ (సీజీపీఏ-7.5) పూర్తయిన విద్యార్థులు నేరుగా పీహెచ్‌డీ చేయొచ్చని చెప్పారు. డీన్‌ ప్రొఫెసర్‌ విజయ గుంటూరు మాట్లాడుతూ.. ఇంజినీరింగ్‌ డొమైన్‌లో పూర్తి సమయం వెచ్చించే విద్యార్థులకు నెలకు రూ.25 వేలు, ఇతర డొమైన్‌ ఉన్నవారికి నెలకు రూ.20 వేల చొప్పున ఉపకారవేతనం అందిస్తున్నామన్నారు. జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందిన విద్యార్థులకు అదనంగా రూ.7 వేలు అందజేయనున్నట్లు ఆమె ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్‌ఆర్‌ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఆర్‌.అర్చనారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని