Tirumala: శ్రీవారి ధర్మ దర్శనానికి 48 గంటల సమయం

శ్రీవారి ధర్మదర్శనం కోసం శనివారం తిరుమలకు భారీగా భక్తులు చేరుకున్నారు. తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ధర్మదర్శనం కోసం వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1, 2, నారాయణగిరి షెడ్లలో నిండిపోయి....

Published : 29 May 2022 09:15 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ధర్మదర్శనం కోసం శనివారం తిరుమలకు భారీగా భక్తులు చేరుకున్నారు. తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ధర్మదర్శనం కోసం వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1, 2, నారాయణగిరి షెడ్లలో నిండిపోయి నందకం అతిథి గృహం వరకు వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనం చేయించడానికి 48 గంటలు పడుతోంది. రద్దీ నేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నాం’ అని తెలిపారు. శ్రీవారిని శుక్రవారం 73,358 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.11 కోట్ల హుండీ కానుకలు లభించాయి. 41,900 మంది తలనీలాలు సమర్పించారు. తిరుమలలో గదుల కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది.

జీడిపప్పు కాంట్రాక్టు రద్దు

శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించేందుకు ఏటా రూ.500 కోట్లతో జీడిపప్పు, నెయ్యి, యాలకులు కొనుగోలు చేస్తున్నారు. వీటిలో నాణ్యత లోపిస్తున్నట్లు భక్తుల నుంచి ఫిర్యాదులు అందడంతో తిరుపతిలోని తితిదే మార్కెటింగ్‌ గోదామును తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శనివారం తనిఖీ చేశారు. జీడిపప్పులో దుమ్ము ఉండటంతోపాటు విరిగిపోయినవి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దాంతో వాటిని సరఫరా చేస్తున్న సంస్థ కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు