తాత్కాలిక ఏర్పాటు.. పట్టుతప్పితే గగుర్పాటు!

చిత్రంలో మీరు చూస్తున్నది నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండలం రాయకూర్‌ బస్టాండు వద్దనున్న ఓ ట్రాన్స్‌ఫార్మర్‌.. దాన్ని అమర్చాల్సిన గద్దె దెబ్బతినగా తాత్కాలికంగా ట్రాక్టర్‌ దమ్ముచక్రాలపై ఉంచి మమ అనిపించారు సిబ్బంది.

Published : 29 May 2022 05:19 IST

చిత్రంలో మీరు చూస్తున్నది నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండలం రాయకూర్‌ బస్టాండు వద్దనున్న ఓ ట్రాన్స్‌ఫార్మర్‌.. దాన్ని అమర్చాల్సిన గద్దె దెబ్బతినగా తాత్కాలికంగా ట్రాక్టర్‌ దమ్ముచక్రాలపై ఉంచి మమ అనిపించారు సిబ్బంది. ఇది జరిగి సుమారు 25 రోజులైంది. ఓపక్క ఈదురుగాలులతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మరోవంక వానాకాలం తరుముకొస్తోంది. అయినా.. ప్రమాదాలు జరగకుండా ట్రాన్స్‌ఫార్మర్‌ను పక్కాగా అమర్చాల్సిన యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఈ అంశంపై డీఈ హరిచంద్‌ వివరణ కోరగా.. ఇన్ని రోజులుగా ట్రాన్స్‌ఫార్మర్‌ అలా ఉంచడం సరికాదన్నారు. సత్వరం సరిచేయిస్తానని సమాధానమిచ్చారు.

- ఈనాడు, నిజామాబాద్‌, న్యూస్‌టుడే, రుద్రూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని