ఒక కొమ్మ.. వంద కాయలు

చిత్రంలో మీరు చూస్తున్నది మూడేళ్ల వయసున్న చిన్న మామిడి మొక్క.. గుత్తులు గుత్తులుగా కాయలు కాసి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రత్యేకించి ఓ కొమ్మ వందకు పైగా కాయలతో ఆకట్టుకుంటోంది. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం బోర్గాంలో పోశెట్టి అనే రైతు ఇంటి ఆవరణలో ఉందిది.

Published : 29 May 2022 05:19 IST

చిత్రంలో మీరు చూస్తున్నది మూడేళ్ల వయసున్న చిన్న మామిడి మొక్క.. గుత్తులు గుత్తులుగా కాయలు కాసి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రత్యేకించి ఓ కొమ్మ వందకు పైగా కాయలతో ఆకట్టుకుంటోంది. నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం బోర్గాంలో పోశెట్టి అనే రైతు ఇంటి ఆవరణలో ఉందిది. ఈ ఏడాది వెయ్యికి పైగా కాయలు కాసిందని రైతు ఆనందం వ్యక్తం చేశారు. కాండం నుంచి కాపు రావడంతో ఈ మొక్క ఇలా గుత్తులుగా కాసిందని, ఇది అరుదేనని, దీన్ని కాల్‌ఫ్లోరస్‌ అని పిలుస్తారని ఉద్యానశాఖ అధికారి వాజిదుజ్జామా వివరించారు.

- న్యూస్‌టుడే, రెంజల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని