పోడు భూములకు పట్టాలివ్వాలి: హరగోపాల్‌

తెలంగాణ రాష్ట్రం వస్తే తమ పోడు భూములకు పట్టాలిస్తారని ఆశించిన లక్షల మంది ఆదివాసీలు, గిరిజనులను కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆరోపించారు.

Published : 29 May 2022 05:23 IST

అబిడ్స్‌, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం వస్తే తమ పోడు భూములకు పట్టాలిస్తారని ఆశించిన లక్షల మంది ఆదివాసీలు, గిరిజనులను కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆరోపించారు. వెంటనే వారికి పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. పోడు భూములకు పట్టాలివ్వాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో శనివారం నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు. దేశంలోని సంపదంతా కొద్దిమంది చేతుల్లోకి వెళ్తోందని.. కోట్ల మంది నిరుపేదలుగా మగ్గిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆదివాసీలు, గిరిజనుల పిల్లలకు మంచి విద్యను అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి.సంధ్య, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెళ్ల కృష్ణ, గోవర్ధన్‌, రణధీర్‌ తదితరులు ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని