సన్నాలు వేసినా నష్టాలు తప్పలేదు

వేసవిలో దొడ్డు రకం వరి వేయొద్దని ప్రభుత్వం చెప్పడంతో నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారంలో రైతులు సన్నరకానికి మొగ్గు చూపారు.

Published : 29 May 2022 05:23 IST

నల్గొండ జిల్లాలో పంటకు నిప్పుపెట్టిన రైతు

నిడమనూరు, న్యూస్‌టుడే: వేసవిలో దొడ్డు రకం వరి వేయొద్దని ప్రభుత్వం చెప్పడంతో నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారంలో రైతులు సన్నరకానికి మొగ్గు చూపారు. సుమారు 15 రోజులు ఆలస్యంగా నాట్లేసిన పొలాలు తెగుళ్ల బారిన పడటంతో దిగుబడి పూర్తిగా తగ్గింది. ధాన్యానికి వచ్చే సొమ్ము కోతల ఖర్చులకూ సరిపోని పరిస్థితి. కంచి శ్రీను రెండెకరాల సొంత పొలంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని హెచ్‌ఎంటీ, చింట్లు, చిట్టిపొట్లు రకాలు వేశారు. నాలుగు ఎకరాల్లో వేసిన హెచ్‌ఎంటీ 100 బస్తాలే దిగుబడి వచ్చింది. రెండు ఎకరాల్లో వేసిన మిగిలిన రకాలను కోస్తే 10 బస్తాలూ వచ్చే పరిస్థితి లేక శనివారం పంటకు నిప్పుపెట్టారు. గ్రామంలో 50 ఎకరాల్లో పంటను కోయకుండానే వదిలేశారు. తెల్కపల్లి కోటేశ్‌ అనే కౌలు రైతు 14 ఎకరాల్లో సన్నాలు వేశారు. రెండెకరాలు కోస్తే 10 బస్తాలే వచ్చింది. సాగుకు రూ.4.5 లక్షలు ఖర్చయిందని.. అందులో 10 శాతమూ రాలేదని వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని