స్ఫూర్తిప్రదాత సురవరం
వనపర్తి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుకు మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో....
మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి
రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: వనపర్తి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుకు మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి ఉత్సవాలు శనివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కులం, మతం పేరుతో దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్న వారికి సురవరం జీవితం ఒక సమాధానమని, నేటి తరానికి ఆయన స్ఫూర్తిప్రదాత అన్నారు. మరో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ చైతన్య స్ఫూర్తి సురవరం ప్రతాపరెడ్డి అని కొనియాడారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడం సముచితమని చాలా మంది అభిప్రాయమన్నారు. సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ.. సురవరం ప్రతాపరెడ్డి కులమతాలను వ్యతిరేకించిన వ్యక్తి అని అన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడారు. శాంతా బయోటెక్ అధినేత డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి, పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి, సాహితీవేత్త డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డా.ఆర్.శేషుశాస్త్రి, తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డా.జుర్రు చెన్నయ్యలకు సురవరం ప్రతాపరెడ్డి పురస్కారాలను మంత్రులు ప్రదానం చేశారు. మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి వారసుడు సురవరం కృష్ణవర్ధన్‌రెడ్డి ఉన్నారు. అనంతరం సాంస్కృతిక శాఖ నిర్వహించిన లఘుచిత్రాల పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్