Reddy JAC: మల్లారెడ్డి కాన్వాయ్‌పై దాడి దురదృష్టకరం: రెడ్డి జేఏసీ

ఘట్‌కేసర్‌లో గత నెల 29న జరిగిన రెడ్డి సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై సభికులు దాడికి దిగడం దురదృష్టకరమని రెడ్డి జేఏసీ విచారం వ్యక్తం చేసింది. రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటుతోపాటు మిగతా

Updated : 22 Nov 2022 16:13 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ఘట్‌కేసర్‌లో గత నెల 29న జరిగిన రెడ్డి సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై సభికులు దాడికి దిగడం దురదృష్టకరమని రెడ్డి జేఏసీ విచారం వ్యక్తం చేసింది. రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటుతోపాటు మిగతా డిమాండ్లపై శనివారం పార్క్‌లేన్‌లోని ఓ హోటల్‌లో అన్ని జిల్లాల ప్రతినిధులతో రెడ్డి జేఏసీ రాష్ట్ర కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. జేఏసీ ఛైర్మన్‌ రాంరెడ్డి, సెక్రటరీ జనరల్‌ గోపు జైపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, కో-ఛైర్మన్‌ హరినాథ్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ‘‘ఘట్‌కేసర్‌ సభలో ప్రధాన డిమాండ్‌పై మంత్రి మల్లారెడ్డి మాట్లాడకుండా తెరాస కార్యక్రమాలపై మాట్లాడుతుండటంతో కొంతమంది ఆవేశంలో అలా చేశారు. అందులో ఎలాంటి కుట్ర లేదు. అసాంఘిక శక్తులు దాడి చేశారనడం సరికాదు. ఈ ఘటనపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలి. సభకు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించాం. రెడ్డి జేఏసీకి ఏ పార్టీతో సంబంధం లేదు’’ అని పేర్కొన్నారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్‌ అంశాన్ని పెట్టిన తెరాస ఇప్పటికీ హామీ నెరవేర్చలేదని, రాబోయే రోజుల్లో దీన్ని పరిశీలించకపోతే పేద రెడ్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని