Private train: పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు

కోయంబత్తూరు నార్త్‌ నుంచి సాయినగర్‌ శిర్డీకి తొలి ప్రైవేటు రైలు మంగళవారం బయలుదేరింది. కేంద్రం ‘భారత్‌ గౌరవ్‌’ పథకం కింద ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు ఇదే కావడం విశేషం. అయిదు రోజుల పాటు

Updated : 15 Jun 2022 13:42 IST

వడపళని, న్యూస్‌టుడే: కోయంబత్తూరు నార్త్‌ నుంచి సాయినగర్‌ శిర్డీకి తొలి ప్రైవేటు రైలు మంగళవారం బయలుదేరింది. కేంద్రం ‘భారత్‌ గౌరవ్‌’ పథకం కింద ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు రైలు ఇదే కావడం విశేషం. అయిదు రోజుల పాటు ప్యాకేజీ టూర్‌ కింద ఇందులో ప్రయాణించవచ్చని దక్షిణ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 1100 మంది ప్రయాణికులతో  ‘దేఖో అప్నా దేశ్‌’ పేరిట మంగళవారం సాయంత్రం 6 గంటలకు కోయంబత్తూరు నార్త్‌లో బయలుదేరిన రైలు సాయినగర్‌ శిర్డీకి 16వ తేదీ ఉదయం 7.25 గంటలకు చేరుతుంది. తిరుపూరు, ఈరోడ్‌, సేలం, ఎలహంక, ధర్మవరం, మంత్రాలయం రోడ్‌, వాడి మీదుగా వెళ్తుంది. కోయంబత్తూరు నుంచి వెళ్లేటప్పుడు మంత్రాలయం రోడ్‌లో మంత్రాలయం ఆలయ సందర్శనార్థం అయిదు గంటల పాటు ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో సాయినగర్‌ శిర్డీలో 17వ తేదీ ఉదయం 7.25 గంటలకు బయలుదేరి కోయంబత్తూరు నార్త్‌కు 18న మధ్యాహ్నం 12 గంటలకు చేరుతుంది. వాడి, ధర్మవరం, ఎలహంక, సేలం, ఈరోడ్‌, తిరుపూరు స్టేషన్లలో ఆగుతుంది. ఆధునిక హంగులతో బోగీలు తయారుచేశారు. అందుబాటులో వైద్యుడు, రైల్వే పోలీసులతో పాటు ప్రైవేటు భద్రతా సిబ్బంది, ఏసీ మెకానిక్‌, అగ్నిమాపక సిబ్బంది ఉంటారు. రుచికరమైన శాఖాహార వంటకాలు అందజేస్తారు. ప్యాకేజీలో భాగంగా వీఐపీ దర్శనం, బస్సు వసతులు, ఏసీ బస వసతితో పాటు టూరిస్టు గైడ్లను అందుబాటులో ఉంచుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని