పిల్లలను బడికి పంపించాలని.. ప్రధానోపాధ్యాయుడి వినూత్న నిరసన

విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం ముదిమాణిక్యం గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఆసక్తికర సన్నివేశం గ్రామస్థులనూ

Updated : 16 Jun 2022 07:26 IST

జోగిపేట, న్యూస్‌టుడే: విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా నిరసన తెలిపారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలం ముదిమాణిక్యం గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఆసక్తికర సన్నివేశం గ్రామస్థులనూ ఆలోచింపజేసింది. గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మొత్తం 175 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో వివిధ తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు పాఠశాల ప్రారంభమైన నాటి నుంచి హాజరవడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్‌రావు బుధవారం ఆ విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లారు. వారి ఇళ్ల ఎదుట పడుకొని నిరసన తెలుపుతూ.. విద్యార్థులను బడికి పంపించాలని తల్లిదండ్రులను కోరారు. దీనిపై స్పందించిన ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు.. అప్పటికప్పుడు తమ పిల్లలను పాఠశాలకు పంపారు. మిగిలిన విద్యార్థులు కూడా పాఠశాలకు వచ్చే వరకు ఇలాగే చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని