రాష్ట్రానికి ఫాక్స్‌కాన్
విద్యుత్తు వాహనాల పరిశ్రమ ఏర్పాటుకు తైవాన్ కంపెనీ సంసిద్ధత
త్వరలో ప్రభుత్వంతో ఒప్పందం
దిల్లీలో సంస్థ ఛైర్మన్ యంగ్లియుతో మంత్రి కేటీఆర్ భేటీ
ఈనాడు, హైదరాబాద్: తైవాన్‌కు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ రాష్ట్రంలో భారీ పెట్టుబడితో విద్యుత్తు వాహనాల పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. సంస్థ ఛైర్మన్ యంగ్లియుతో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ దిల్లీలో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చించారు. తమ సంస్థ విస్తరణలో భాగంగా తెలంగాణను ఎంచుకున్నట్లు యంగ్లియు వివరించారు. ఆయన నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు. ప్రభుత్వం తరఫున అత్యుత్తమ రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ దృశ్యరూపక ప్రదర్శన ద్వారా తెలంగాణలో పెట్టుబడులకు సానుకూలతలు, మౌలిక వసతులు, మానవ వనరుల లభ్యత గురించి వివరించారు. ఫార్చ్యూన్ 500 సంస్థ అయిన ఫాక్స్‌కాన్ అత్యధిక ఉద్యోగాలిస్తోందని తెలిపారు. అనంతరం యంగ్లియు మాట్లాడుతూ..‘‘ఇప్పటికే తమిళనాడు, ఏపీలలో పరిశ్రమను నిర్వహిస్తున్నాం. కొత్తగా తెలంగాణలోనూ స్థాపించి, అక్కడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాం’’ అని అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ విద్యుత్తు వాహనాలతో పాటు ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, డిజిటల్ ఆరోగ్యరంగంలోనూ పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలమని తైవాన్ బృందానికి తెలిపారు. అనంతరం యంగ్లియు ప్రతినిధి బృందాన్ని పోచంపల్లి శాలువా, జ్ఞాపికతో కేటీఆర్ సత్కరించారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, ఎలక్ట్రానిక్స్ విభాగం సంచాలకుడు సుజయ్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
CUET-UG: రద్దయిన సీయూఈటీ-యూజీ పరీక్షల నిర్వహణ ఆగస్టు 24-28 తేదీల్లో
-
Politics News
Harish Rao: నీతి ఆయోగ్ పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోంది: హరీశ్‌రావు
-
General News
Bananas: అరటిపండే కదా తీసి పారేయకండి..!
-
World News
Canada: కెనడాలో 10లక్షల ఉద్యోగాలు ఖాళీ..!
-
Politics News
Errabelli Pradeep Rao: తెరాసకు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు గుడ్‌బై
-
World News
Ukraine: జపరోషియా అణువిద్యుత్తు కేంద్రం దెబ్బతింది..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- సూర్య అనే నేను...
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం
- Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/08/2022)