Published : 24 Jun 2022 05:36 IST

ఆవిష్కరణల జగత్‌ సాక్షాత్కారం

 టీహబ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నొవేషన్‌ క్యాంపస్‌

రూ.276 కోట్లతో 10 అంతస్తుల్లో నిర్మాణం

ఈనాడు, హైదరాబాద్‌: టీహబ్‌లో ప్రపంచంలోనే అతి పెద్దదైన ఇన్నొవేషన్‌ క్యాంపస్‌ ప్రారంభోత్సవానికి సర్వసన్నద్ధమైంది. ఐటీ, అంకురాలు, ఆవిష్కరణలు, నవీన సాంకేతికతలు, పరిశోధన అభివృద్ధిలో పురోగమిస్తున్న రాష్ట్రానికి ఇది మరింత ఊతమివ్వనుంది. ఆధునిక సాంకేతికత, భారీ వనరులు, సకల సౌకర్యాలు దీని సొంతం. తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక కేంద్రం (టీహబ్‌)లోని ఈ ఆవిష్కరణల ప్రాంగణం (ఇన్నొవేషన్‌క్యాంపస్‌) రాష్ట్రానికి తలమానికం కానుంది. దీన్ని మంత్రి కేటీఆర్‌ ఈ నెల 28న ప్రారంభించనున్నారు.

తెలంగాణకు బ్రాండ్‌గా మారిన టీహబ్‌

మంత్రి కేటీఆర్‌ ఆలోచనల మేరకు ఐటీ అంకురాలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా టీహబ్‌ ఆరేళ్ల క్రితం ప్రారంభమైంది. ఇది 4,200కి పైగా అంకురాల స్థాపన ద్వారా రూ.2,200 కోట్ల మేర పెట్టుబడులను సమీకరించింది. ఇందులో 350 అంతర్జాతీయ అంకురాలు. 435 కార్పొరేట్‌ సంస్థలు టీహబ్‌లో భాగస్వామిగా ఉన్నాయి. టీహబ్‌ తెలంగాణకు బ్రాండ్‌గా మారింది. ప్రస్తుతం ఉన్న భవనంలో 60 వేల చదరపు అడుగుల స్థలమే ఉంది. కొత్త అంకురాలు, పరిశోధనలు భారీఎత్తున పెరుగుతున్నందున ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఉండేలా భారీ వైశాల్యంతో కొత్తభవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయదుర్గం వద్ద గల విజ్ఞాన నగరంలోని మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ వద్ద 3ఎకరాల భూమిని ఇచ్చింది. నిర్మాణానికి రూ.276 కోట్లను కేటాయించింది. మూడేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అతి పెద్ద ఆవిష్కరణల కేంద్రం ప్రారంభానికి సర్వ సన్నద్ధమైంది. 2వేల అంకురాల స్థాపనకు వ్యవస్థాపకులతో పాటు వెంచర్‌ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు, మార్గదర్శకులు సలహాదారులకు చోటు కల్పించేలా ఏర్పాట్లు చేశారు. 2లక్షల చదరపు అడుగుల బేస్‌మెంట్‌తో 53.65 మీటర్ల ఎత్తు, పది అంతస్తులతో భవంతిని నిర్మించారు.

అంకురాలు, ఆవిష్కరణలకు మరింత ఊతం: కేటీఆర్‌

కొత్త ప్రాంగణం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అంకురాలు, సాంకేతిక ఆవిష్కరణలకు తెలంగాణ మరింత ఊతమివ్వనుంది. హైదరాబాద్‌లో దాదాపు 500 మంది, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో మరో 100 మంది వరకు  ఏంజెల్‌ ఇన్వెస్టర్లు ఉన్నారు. ఈ సంఖ్యను 10 రెట్లు పెంచాలనేదే మా సంకల్పం.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని