ఎగురుతూ... సాగిపోయేలా!

రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. వేగంగా దూసుకెళ్దామంటే కుదరని పరిస్థితి. దీంతో ప్రధాన నగరాల్లో వ్యక్తిగత ఏరియల్‌ వాహనాలను వినియోగంలోకి తెచ్చే అంశమై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇందులో

Published : 24 Jun 2022 05:36 IST

 వ్యక్తిగత ఏరియల్‌ వాహనాల డిజైన్లపై ఐఐటీ హైదరాబాద్‌ పరిశోధన

28 డిజైన్లు రూపొందించిన పరిశోధక విద్యార్థి ప్రియబత్ర రౌత్రే

ఈనాడు, సంగారెడ్డి: రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. వేగంగా దూసుకెళ్దామంటే కుదరని పరిస్థితి. దీంతో ప్రధాన నగరాల్లో వ్యక్తిగత ఏరియల్‌ వాహనాలను వినియోగంలోకి తెచ్చే అంశమై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఐఐటీ హైదరాబాద్‌లోని డిజైన్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ వాహనాల ఆకృతులు ఎలా ఉంటే  సమర్థంగా వినియోగించుకోవచ్చనే విషయమై కసరత్తు చేస్తోంది. పరిశోధక విద్యార్థి ప్రియబత్ర రౌత్రే ఇందులో కీలకంగా ఉన్నారు. ప్రయాణించడానికి సాంకేతికంగా అనువుగా ఉండటంతో పాటు చక్కని రూపు, ఆకట్టుకునే ఆకృతి ఉండేలా ఆయన మొత్తం 28 డిజైన్లను రూపొందించారు. దేశవ్యాప్తంగా ఈ అంశమై చేపట్టిన సర్వేల ఫలితాలను వాడుకోవడంతో పాటు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఆకృతులను సిద్ధం చేసినట్లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఐఐటీ హైదరాబాద్‌లో వీటిని ప్రదర్శించనున్నారు. ప్రియబత్ర రౌత్రే ఐఐటీ హైదరాబాద్‌, ఆస్ట్రేలియాలోని స్విన్‌బర్న్‌ విశ్వవిద్యాలయాల్లో సంయుక్త పీహెచ్‌డీ కొనసాగిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని