గిట్టుబాటు కాని ఎవుసం.. రెక్కల కష్టమే ప్రత్యామ్నాయం..!

వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న దిగుబడి, గిట్టుబాటు ధరలు దక్కకపోవడంతో అన్నదాతలు సాగు వ్యయాన్ని తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. సోయా సాగులో భాగంగా పొలం దున్ని

Published : 24 Jun 2022 05:36 IST

వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న దిగుబడి, గిట్టుబాటు ధరలు దక్కకపోవడంతో అన్నదాతలు సాగు వ్యయాన్ని తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. సోయా సాగులో భాగంగా పొలం దున్ని విత్తనాలు వేశాక మట్టిని సమానంగా చేస్తారు. ఇందు కోసం ట్రాక్టర్‌కైతే గంటకు రూ.900 వరకు అద్దె తీసుకుంటున్నారు. చిన్న రైతులకు ఈ మొత్తం భారంగా మారుతుంది. దీంతో వారు రెక్కల కష్టాన్నే నమ్ముకుంటున్నారు. నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలంలోని జీజీనడ్కుడ గ్రామానికి చెందిన లింగన్న అనే రైతు.. తనకున్న రెండున్నర ఎకరాల్లో సోయా పంట వేశారు. ట్రాక్టర్‌కు అద్దె భరించలేని ఆయన మరో రైతు, కుమారుడితో కలిసి స్వయంగా ఇలా పనులు చేసుకుంటున్నారు.

   -ఈనాడు, నిజామాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని