ఇక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు పెట్టేందుకు ఏపీ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అమ్మఒడితో పాటు 2022 సంక్షేమ క్యాలెండర్‌లో భాగంగా జులైలో మరో నాలుగు పథకాల అమలుకు

Published : 25 Jun 2022 03:08 IST

పేరు మార్పు నిర్ణయానికి ఏపీ మంత్రిమండలి ఆమోదం

ఈనాడు, అమరావతి: కోనసీమ జిల్లాకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా పేరు పెట్టేందుకు ఏపీ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అమ్మఒడితో పాటు 2022 సంక్షేమ క్యాలెండర్‌లో భాగంగా జులైలో మరో నాలుగు పథకాల అమలుకు అంగీకారం తెలిపింది. ఏపీ సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం సుమారు మూడు గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం ఆ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... జిల్లాల పునర్విభజన నేపథ్యంలో 13 పాత జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్పీ ఛైర్మన్లనే 26 జిల్లాలకు కొనసాగించాలని కేబినెట్‌ తీర్మానించిందన్నారు. జిల్లాల విభజనకు సంబంధించిన సవరణలు, మార్పులు, చేర్పులతో కూడిన తుది నోటిఫికేషన్‌కు ఆమోదం లభించిందని చెప్పారు. ఎంఐజీ లేఅవుట్లలో ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యానికి, ఇప్పటికే ఉన్న భూసేకరణ విధానాలకు అదనంగా మరో కొత్త విధానం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు.

ఆన్‌లైన్‌ టికెట్లపై వివాదం లేదు

‘ఆన్‌లైన్‌ సినిమా టికెట్ల వ్యవహారంలో ఎటువంటి వివాదం లేదు. థియేటర్‌ యజమాన్యాలు, ప్రజలూ ఆనందంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. కొన్ని సంస్థలతో జరిగిన ఒప్పందాలతో తలెత్తిన సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయి. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా చలనచిత్రాల షూటింగులు చేసుకోవచ్చు’ అని మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని