ఫ్లిప్‌కార్ట్‌తో నేడు సెర్ప్‌ ఒప్పందం

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ఆధ్వర్యంలోని మహిళా సంఘాల వస్తువులు, ఎఫ్‌పీవోలు సేకరించిన ధాన్యం ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 25 Jun 2022 03:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ఆధ్వర్యంలోని మహిళా సంఘాల వస్తువులు, ఎఫ్‌పీవోలు సేకరించిన ధాన్యం ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్‌ సంస్థను ఎంపిక చేసింది. శనివారం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో సెర్ప్‌ సీఈవో సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఫ్లిప్‌కార్ట్‌ ఉపాధ్యక్షుడు రవిచంద్రన్‌లు ఒప్పంద పత్రాలపై సంతకం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని