దివ్యాంగుల అభ్యున్నతికి కృషి

దివ్యాంగుల అభ్యున్నతి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సామాజిక, దివ్యాంగుల, వయోజనుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. దిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి

Published : 25 Jun 2022 05:32 IST

మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ఈనాడు, దిల్లీ: దివ్యాంగుల అభ్యున్నతి, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సామాజిక, దివ్యాంగుల, వయోజనుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. దిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ మంత్రి వీరేంద్రకుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన దివ్యాంగుల జాతీయ సలహా మండలి సమావేశానికి ఆయన హాజరయ్యారు. సమావేశంలో మంత్రి ఈశ్వర్‌ మాట్లాడుతూ దివ్యాంగుల భద్రత, సంక్షేమానికి రాష్ట్రంలో ప్రత్యేక విభాగం ఉందని తెలిపారు. దివ్యాంగులు ఎదుర్కొనే తక్షణ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీలు పని చేస్తున్నాయని వివరించారు. దివ్యాంగులకు నెలకు రూ.3,016 పింఛన్‌ రూపంలో ఇస్తున్నామని తెలిపారు. వారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వివిధ పరికరాలు అందజేస్తున్నామని చెప్పారు. పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో అయిదు శాతం రిజర్వేషన్‌ ఇస్తున్నామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర దివ్యాంగుల, వయోజనుల సంక్షేమ శాఖ సంచాలకురాలు బి.శైలజ పాల్గొన్నారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్‌, తెరాస లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేష్‌ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్‌ ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్‌సింగ్‌ను కలిశారు. రామగుండం నియోజకవర్గంలో ఎన్టీపీసీ సంస్థ బూడిద కాలుష్యంతో నష్టపోతున్న కుందనపల్లి, సమీప గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. త్వరలోనే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని సీఎండీ వారికి హామీ ఇచ్చారు. సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులతో రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని