పోడు సమస్యలు లేకుండా చూడాలి

గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. గిరిజన గూడేల్లో విద్యుత్తు, తాగునీటి

Published : 25 Jun 2022 05:32 IST

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. గిరిజన గూడేల్లో విద్యుత్తు, తాగునీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. వానాకాలంలో తలెత్తే రోడ్ల సమస్యల్ని పరిష్కరించాలని, అవసరమైన చోట లింకురోడ్లు మంజూరు చేస్తామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారుల శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఈ నెల 23న వేర్వేరు ప్రాంతాల్లోని గురుకులాల్లో ఇద్దరు విద్యార్థులు మరణించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆరోగ్య, మానసిక పరిస్థితిపై అధికారులు దృష్టి సారించాలని, వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైతే ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టడంతో పాటు నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. గిరివికాసం పథకాన్ని పటిష్ఠంగా అమలు చేస్తూ ఏజెన్సీ గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని