‘అపోలో’ ప్రతాప్‌ సి.రెడ్డికి జీవన సాఫల్య పురస్కారం

అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డా.ప్రతాప్‌ సి.రెడ్డికి ప్రతిష్ఠాత్మక జీవన సాఫల్య పురస్కారం (లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు) లభించింది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తమిళనాడు శాఖ, జూనియర్‌ డాక్టర్స్‌ నెట్‌వర్క్‌,

Published : 25 Jun 2022 05:32 IST

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డా.ప్రతాప్‌ సి.రెడ్డికి ప్రతిష్ఠాత్మక జీవన సాఫల్య పురస్కారం (లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు) లభించింది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తమిళనాడు శాఖ, జూనియర్‌ డాక్టర్స్‌ నెట్‌వర్క్‌, మెడికల్‌ స్టూడెంట్స్‌ నెట్‌వర్క్‌ల ఆధ్వర్యంలో చెన్నైలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ యువ వైద్యుల దినోత్సవం (వరల్డ్‌ యంగ్‌ డాక్టర్స్‌ డే) సదస్సులో ఈ అవార్డును ఆయనకు అందజేశారు. దేశంలో ప్రైవేటు రంగంలో ఆరోగ్య సంరక్షణకు మార్గదర్శకత్వం చేసిన నేపథ్యంలో.. ఆయనను ఆధునిక భారతీయ ఆరోగ్య సంరక్షణ రూపశిల్పిగా గుర్తించి ఈ పురస్కారం అందజేసినట్లు తెలిపారు  ప్రపంచ స్థాయి వైద్య సేవలు ప్రతి భారతీయుడికీ అందుబాటులోకి తీసుకురావడంలో డా.ప్రతాప్‌ సి.రెడ్డి చేసిన కృషి ఫలితంగా సంస్థ  అపోలో సంస్థ ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని