Published : 25 Jun 2022 05:32 IST

రాష్ట్రంలో పెరిగిన పాజిటివిటీ రేటు

గత 24 రోజుల్లో 0.61 నుంచి 1.69 శాతానికి పెరుగుదల
కొత్తగా 493 కొవిడ్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు క్రమేణా పెరుగుతోంది. ఈ నెలలో గత 24 రోజుల పాజిటివిటీని పరిశీలిస్తే.. అదనంగా ఒక శాతానికి పైగా పెరిగింది. అది ఈ నెల 1న 0.61 శాతం ఉండగా.. 24న 1.69 శాతానికి ఎగబాకింది. గత వారం రోజుల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 3.62 శాతం పాజిటివిటీ నిర్ధారణవ్వగా.. తర్వాత స్థానాల్లో హైదరాబాద్‌ 2.8 శాతం, మేడ్చల్‌ 1.93, ఖమ్మం జిల్లాలో 1.18 శాతం మేర నమోదైంది. మొత్తంగా 20 జిల్లాల్లో పాజిటివిటీ రేటు పెరగడం వైరస్‌ వ్యాప్తికి నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 29,084 నమూనాలను పరీక్షించగా.. ఇందులో 493 కొత్త కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. గత మూడు నెలల్లో ఇదే అత్యధిక పెరుగుదల. ఈ నెల 24న సాయంత్రం 5.30 గంటల వరకు నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. తాజాగా 219 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,322 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారు. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో 366 పాజిటివ్‌లు నిర్ధారణ కాగా.. రంగారెడ్డిలో 40, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 34 చొప్పున నమోదయ్యాయి. ఆదిలాబాద్‌, జగిత్యాల, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మెదక్‌, నల్గొండ, నారాయణపేట, నిర్మల్‌, సిద్దిపేట, వనపర్తి జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోనూ కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 18,605 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts