ఊరూరా క్రీడా ప్రాంగణాలు

రాష్ట్రంలో ఊరూరా స్థలాలను గుర్తించి క్రీడా ప్రాంగణ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు చొరవ చూపాలని.. జిల్లా, మండల అధికారులు

Published : 26 Jun 2022 05:17 IST

వెంటనే స్థలాలు గుర్తించి పనులు ప్రారంభించాలి

సమీక్షలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఊరూరా స్థలాలను గుర్తించి క్రీడా ప్రాంగణ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు చొరవ చూపాలని.. జిల్లా, మండల అధికారులు, సర్పంచులు కృషి చేయాలన్నారు. తెలంగాణలో పర్యాటక రంగాన్ని అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్నారు. శనివారం ఆయన తమ కార్యాలయంలో క్రీడలు, పర్యాటక శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ శాఖల ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్త, ఎండీ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘‘సీఎం ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో మైదానాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ పరిధిలోని మైదానాలను గూగుల్‌ మ్యాప్‌కు అనుసంధానం చేస్తూ సమగ్ర జాబితాను సిద్ధం చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టు, సోమశిల, లక్నవరం, యాదాద్రి, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, మానేరు రివర్‌ ఫ్రంట్‌ వంటి పర్యాటక ప్రాంతాలపై వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో విస్తృత ప్రచారం చేయాలి. టూరిజం కేంద్రాల లీజుదారుల నుంచి పాత బకాయిలను వెంటనే వసూలు చేయాలి. కోర్టు వివాదాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాల కేసుల్లో త్వరితగతిన కౌంటర్లు దాఖలు చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఖాళీ, లీజు స్థలాల జాబితాను రూపొందించాలి’’ అని మంత్రి ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని