దక్షిణ డిస్కంలో నిర్మాణ ధరల పెంపు

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) చేపడుతున్న నిర్మాణాలకు చెల్లించే ‘స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేటు’(ఎస్‌ఎస్‌ఆర్‌)ను 25 నుంచి 30 శాతం వరకూ పెంచుతున్నట్లు సంస్థ శనివారం ప్రకటించింది. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సూచనలతో

Updated : 26 Jun 2022 06:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) చేపడుతున్న నిర్మాణాలకు చెల్లించే ‘స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేటు’(ఎస్‌ఎస్‌ఆర్‌)ను 25 నుంచి 30 శాతం వరకూ పెంచుతున్నట్లు సంస్థ శనివారం ప్రకటించింది. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సూచనలతో డిస్కం సీఎండీ రఘుమారెడ్డి ఈ పెంపుపై తెలంగాణ గుత్తేదారుల సంఘం నేతలతో ఇటీవల చర్చలు జరిపారు. అనంతరం అసోసియేషన్‌ డిమాండ్ల పరిశీలన నిమిత్తం ఎనిమిది మందితో వేసిన కమిటీ ఇచ్చిన తుది నివేదికను అనుసరించి ధరలను పెంచినట్టు సంస్థ తెలిపింది. ఆ మేరకు పట్టణ ప్రాంతాల్లో 30%, గ్రామీణ ప్రాంతాలలో 25% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని