ఈసారి ఫలితాలతో పాటే టెట్‌ తుది ‘కీ’

విద్యాశాఖ ఈ సారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) తుది ‘కీ’ని ఫలితాలతోపాటే ఇవ్వనుంది. గతంలో ఫలితాలకు మూడు రోజుల ముందు ‘కీ’ని ఇచ్చేవారు. ఈసారి అందుకు భిన్నంగా ఫలితాలతోపాటు దాన్ని వెల్లడిస్తామని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు.

Published : 26 Jun 2022 04:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్యాశాఖ ఈ సారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) తుది ‘కీ’ని ఫలితాలతోపాటే ఇవ్వనుంది. గతంలో ఫలితాలకు మూడు రోజుల ముందు ‘కీ’ని ఇచ్చేవారు. ఈసారి అందుకు భిన్నంగా ఫలితాలతోపాటు దాన్ని వెల్లడిస్తామని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. టెట్‌ ఫలితాలను జూన్‌ 27న విడుదల చేస్తామని నోటిఫికేషన్‌లో విద్యాశాఖ పేర్కొంది. అయితే, ఆ రోజే వెల్లడిస్తామని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేయలేకపోతున్నాయి. ఈ నెల 12న నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని అధికారులు విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించారు. దీనిపై భారీఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని