ఖమ్మంలో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ ఆగస్టులో!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పే పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం రూ.3.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. రవాణా శాఖ మంత్రి

Published : 26 Jun 2022 04:57 IST

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పే పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం రూ.3.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవతో నీటిపారుదల శాఖ అధికారులు ఈ నెల 20న అనుమతివ్వడంతో ఆగస్టులో ఆవిష్కరించేందుకు ఎన్టీఆర్‌ అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణావతారంలో ఉండే 40 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని తీగల వంతెన మధ్య ప్రతిష్ఠించేందుకు బేస్‌మెంట్‌ నిర్మాణాన్ని చేపట్టారు. నిజమాబాద్‌లో చేపట్టిన విగ్రహం తయారీ పనులు పూర్తయ్యాయి. ప్రతిమను లకారం వద్దకు చేర్చడం, క్రేన్‌ల ద్వారా నిలబెట్టడం వంటి పనులపై నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు. ఆవిష్కరణ రోజు పూల వర్షం కురిపించేందుకు హెలికాప్టర్‌ను సైతం సిద్ధం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని