సరెండర్‌ లీవ్‌లు ఇప్పించండి

పెండింగ్‌లో ఉన్న మూడు సరెండర్‌ లీవ్‌లతోపాటు టీఏలకు సంబంధించిన డబ్బులను ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి, ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, శంకర్‌రెడ్డి, షకీల్‌, వెంకటేశ్వర్లు తదితరులు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డిని

Published : 26 Jun 2022 04:57 IST

డీజీపీతో సమావేశంలో పోలీసు అధికారుల సంఘం

ఈనాడు, హైదరాబాద్‌: పెండింగ్‌లో ఉన్న మూడు సరెండర్‌ లీవ్‌లతోపాటు టీఏలకు సంబంధించిన డబ్బులను ఇప్పించాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి, ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, శంకర్‌రెడ్డి, షకీల్‌, వెంకటేశ్వర్లు తదితరులు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డిని కోరారు. శనివారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సంఘం ప్రతినిధులు పలు సమస్యలపై డీజీపీకి వినతిపత్రం అందించారు. శిక్షణ పూర్తయిన ఏఎస్‌ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతులు కల్పించాలని, ర్యాంకర్‌ ఎస్‌ఐ పదోన్నతుల కోటాను 30 నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. కానిస్టేబుళ్లు పదవీ విరమణ నాటికి ఎస్‌ఐలు అయ్యేలా సంస్కరణలు చేపట్టాలని, వివిధ అలవెన్సులకు సంబంధించిన జీవోలను జారీ చేయాలని వారు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో అదనపు డీజీపీలు శివధర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, నాగిరెడ్డి, ఐజీ కమలాసన్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని