కుమురంభీం జలాశయం రెండు గేట్ల ఎత్తివేత

కుమురంభీం జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆసిఫాబాద్‌ మండలంలోని కుమురంభీం జలాశయంలోకి వరదనీరు పోటెత్తడంతో శనివారం సాయంత్రం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి

Published : 26 Jun 2022 04:57 IST

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: కుమురంభీం జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆసిఫాబాద్‌ మండలంలోని కుమురంభీం జలాశయంలోకి వరదనీరు పోటెత్తడంతో శనివారం సాయంత్రం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 మీటర్లు కాగా ఎగువన కురుస్తున్న వర్షంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం సాయంత్రం ప్రాజెక్టు నీటిమట్టం 241.50 మీటర్లకు చేరడంతో 5, 6 గేట్లను ఒక మీటరు పైకెత్తి 5,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇదే జిల్లాలోని వట్టివాగుకు వరద పోటెత్తడంతో 2, 3 నంబరు గేట్లు ఎత్తి 1,445 క్యూసెక్కులు వదిలారు. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు