సోయా విత్తన డీలరుపై పీడీయాక్టు పెట్టాలి

నకిలీ సోయా విత్తనాలు అంటగట్టి నష్టం చేకూర్చిన డీలరుపై పీడీయాక్టు నమోదు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. సోయా మొలకెత్తలేదని ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌, కరంజి, తంతోలి గ్రామాలకు చెందిన రైతులు శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం

Published : 26 Jun 2022 04:57 IST

ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : నకిలీ సోయా విత్తనాలు అంటగట్టి నష్టం చేకూర్చిన డీలరుపై పీడీయాక్టు నమోదు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. సోయా మొలకెత్తలేదని ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌, కరంజి, తంతోలి గ్రామాలకు చెందిన రైతులు శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ఎదుట ఖాళీ విత్తన సంచులతో నిరసన తెలిపారు. డీలరుపై కేసు నమోదు చేసి నష్టపరిహారం ఇప్పించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.7-10 వేల వరకు పెట్టుబడి నష్టపోయామని వాపోయారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని నిఖిల్‌ ఫర్టిలైజర్స్‌ నుంచి విక్రాంత్‌ విత్తనాలు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. గతంలో సదరు డీలరుపై నకిలీ విత్తనాలు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. డీలర్‌పై కఠిన చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని