తారు రోడ్డుపైనా నీరు ఇంకిపోతుంది!
వర్షాలు బాగా కురిస్తే మట్టి రోడ్లపై నిలిచిన నీరు భూమిలోకి ఇంకినట్టు.. తారు, సిమెంటు రోడ్లపై ఇంకదు. ఈ సమస్యకు వరంగల్ ఎన్ఐటీ సివిల్ ఇంజినీరింగ్ పరిశోధక విద్యార్థి గుమ్మడి చిరంజీవి.. ప్రొఫెసర్ ఎస్.శంకర్ మార్గదర్శనంలో ప్రత్యామ్నాయం
అభివృద్ధి చేసిన ఎన్ఐటీ పరిశోధక విద్యార్థి
ఈనాడు, వరంగల్: వర్షాలు బాగా కురిస్తే మట్టి రోడ్లపై నిలిచిన నీరు భూమిలోకి ఇంకినట్టు.. తారు, సిమెంటు రోడ్లపై ఇంకదు. ఈ సమస్యకు వరంగల్ ఎన్ఐటీ సివిల్ ఇంజినీరింగ్ పరిశోధక విద్యార్థి గుమ్మడి చిరంజీవి.. ప్రొఫెసర్ ఎస్.శంకర్ మార్గదర్శనంలో ప్రత్యామ్నాయం చూపారు. పోరస్ తారు రహదారిని అభివృద్ధి చేశారు. ఈ విధానంలో ఆ రోడ్డుపై భారీ వర్షాలు కురిసినా వెంటవెంటనే నీరు ఇంకిపోతుంది. లోపలున్న మరికొన్ని పొరల్లో చేరి నిదానంగా పక్కనున్న డ్రెయిన్లలోకి వెళ్తుంది. వర్షం ద్వారా వచ్చే చెత్తా చెదారాన్ని వడకట్టి నీటిని మాత్రమే లోనికి పంపేంత సూక్ష్మ రంధ్రాలతో తారు, సిమెంటును రూపొందించడం ఈ విధానం ప్రత్యేకత. త్వరలో ఎన్ఐటీ క్యాంపస్‌లో 50 మీటర్ల మేర ఈ విధానంలో రహదారిని నిర్మిస్తామని ఈ పరిశోధనకు గైడ్‌గా ఉన్న ప్రొఫెసర్ శంకర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా