సాగర్‌ నీటిమట్టం 533 అడుగులు.. ఎస్సారెస్పీకి 4,572 క్యూసెక్కుల ప్రవాహం

శ్రీశైలం దిగువన కృష్ణా పరివాహకంలో కురుస్తున్నవర్షాలకు నాగార్జునసాగర్‌ జలమట్టం క్రమంగా పెరుగుతోంది. 7,367 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో ఆదివారం సాగర్‌లో నీటి మట్టం 533 అడుగులకు చేరుకుంది. జలాశయ నిల్వ సామర్థ్యం

Published : 27 Jun 2022 03:48 IST

ఈనాడు, హైదరాబాద్‌:  శ్రీశైలం దిగువన కృష్ణా పరివాహకంలో కురుస్తున్నవర్షాలకు నాగార్జునసాగర్‌ జలమట్టం క్రమంగా పెరుగుతోంది. 7,367 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో ఆదివారం సాగర్‌లో నీటి మట్టం 533 అడుగులకు చేరుకుంది. జలాశయ నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 174.06 టీఎంసీలున్నాయి. తుంగభద్రకు 1647 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. మరోవైపు 4,572 క్యూసెక్కుల గోదావరి జలాలు వచ్చి చేరుతుండడంతో ఎస్సారెస్పీ నీటిమట్టం పెరుగుతోంది. కడెం ప్రాజెక్టుకు 2060, ఎల్లంపల్లికి 1170 క్యూసెక్కుల ప్రవాహం నమోదయింది. మహారాష్ట్ర, ఆదిలాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు ప్రాణహితకు వరద వస్తుండగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద 9,300క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని