Published : 27 Jun 2022 05:48 IST

రాక్‌గార్డెన్‌ను పరిరక్షిస్తాం!

 మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

‘ఈనాడు’ కథనానికి స్పందన

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో ‘రాక్‌ గార్డెన్‌’ అభివృద్ధికి కేటాయించిన స్థలం కబ్జాకు గురవుతోందంటూ ఆదివారం ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘రూ.300 కోట్ల భూమికి చెర’ కథనంపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్పందించారు. ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ కబ్జాకు గురైన రాక్‌ గార్డెన్‌ స్థలాన్ని స్వాధీనం చేసుకుని, పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. దాని చుట్టూ రక్షణ గోడ నిర్మించాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, ఆర్డీవో, స్థానిక ఎమ్మార్వోతో మాట్లాడామని వివరించారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ రాజ్‌కుమార్‌ ఆదివారం రాక్‌గార్డెన్‌ స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మంత్రి కేటీఆర్‌ ఈ వ్యవహారంపై ఆరా తీసినట్లు తెలిసింది.

వేరే నియోజకవర్గం వారే: దానం నాగేందర్‌

నగరంలోని మరో నియోజకవర్గానికి చెందిన వారు రాక్‌గార్డెన్‌ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించగా గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తెలిపారు. వారు స్థానిక అధికారుల్ని భయభ్రాంతులకు గురిచేసిన విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించినట్లు చెప్పారు. ‘2009లో మంత్రిగా ఉన్న సమయంలో రాక్‌ గార్డెన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. దానిని నగరానికే తలమానికంగా తీర్చిదిద్దుతాం. భూములు ఆక్రమణకు గురవకుండా చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts