మూడు పూటలా సచివాలయ నిర్మాణం: ప్రశాంత్‌రెడ్డి

తెలంగాణ సచివాలయ నిర్మాణపనులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా వేగం పెంచాలని, మూడుపూటలా కొనసాగాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. మేస్త్రీలు, కూలీల సంఖ్య పెంచాలన్నారు.

Published : 27 Jun 2022 05:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయ నిర్మాణపనులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా వేగం పెంచాలని, మూడుపూటలా కొనసాగాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. మేస్త్రీలు, కూలీల సంఖ్య పెంచాలన్నారు. ప్రస్తుతం 1,450 మంది కూలీలు పనిచేస్తున్నారని, మరో వేయి మందిని పనుల్లోకి తీసుకోవాలన్నారు. ఆదివారం ఆయన దాదాపు నాలుగు గంటల పాటు సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా దూల్పూర్‌ రెడ్‌ స్టోన్‌ రాతి కట్టడం పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు రాజస్థాన్‌ నుంచి మేస్త్రీలను పిలిపించాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రూ.13,030 కోట్లతో 7,460 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం, అభివృద్ధి, విస్తరణ పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.7,526 కోట్లతో 6,319 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని