యాదాద్రికి ఒక్కరోజే 70 వేల మంది భక్తులు!

యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 70 వేల మంది భక్తులు క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. ధర్మదర్శనానికి నాలుగు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.

Published : 27 Jun 2022 05:24 IST

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 70 వేల మంది భక్తులు క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు అధికారుల అంచనా. ధర్మదర్శనానికి నాలుగు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. దర్శన నిరీక్షణ, క్యూలైన్లలో పంకాలు లేవని, మంచినీటి వసతులు కల్పించలేదని వాపోయారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో క్యూ కాంప్లెక్స్‌ భవనంపై నీరు నిలిచి స్లాబు నుంచి కారుతోంది. ఆలయ పరిసరాలు తడవకుండా దేవస్థాన సిబ్బంది బకెట్‌, స్పాంజీని ఏర్పాటు చేశారు. ప్రసాద విక్రయ కేంద్రం వద్ద కూడా ఇలాగే సమస్య నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని