నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబరు నెల కోటాను సోమవారం తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మొత్తం 46,470 టికెట్లలో లక్కీడిప్‌ ద్వారా 8,070 టికెట్లు కేటాయించనున్నారు. అదేవిధంగా ముందు వచ్చిన

Published : 27 Jun 2022 05:24 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబరు నెల కోటాను సోమవారం తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మొత్తం 46,470 టికెట్లలో లక్కీడిప్‌ ద్వారా 8,070 టికెట్లు కేటాయించనున్నారు. అదేవిధంగా ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన 38,400 టికెట్లు జారీ చేస్తారు. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు జూన్‌ 29వ తేదీ సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయి.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు పడుతోంది. స్వామివారిని శనివారం అత్యధికంగా 94,411 మంది భక్తులు దర్శించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని