జాతీయ లోక్‌ అదాలత్‌లో 7.50 లక్షల కేసుల పరిష్కారం

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 7.50 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్‌.గోవర్ధన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో

Published : 27 Jun 2022 05:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 7.50 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్‌.గోవర్ధన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 8,175 ప్రీ లిటిగేషన్‌ కేసులు, 7.42 లక్షల పెండింగ్‌ కేసులు ఉండగా, రూ.109.45 కోట్ల పరిహారం అందించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ పాట్రన్‌ ఇన్‌ చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్మన్‌, జస్టిస్‌ పి.నవీన్‌రావు నేతృత్వంలోని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్లు, జిల్లా ప్రధాన న్యాయమూర్తుల సమన్వయంతో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

హైకోర్టులో..: హైకోర్టులో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 629 కేసులు పరిష్కారమవగా రూ.36.06 కోట్లు పరిహారం అందించారు. ఇందులో అత్యధికంగా 567 మోటారు ప్రమాద క్లెయిమ్‌లు ఉండగా.. మిగిలినవి వర్క్‌మెన్‌ కాంపెన్సేషన్‌, క్రిమినల్‌, సిటీ సివిల్‌ కోర్టు అప్పీలు, రిట్‌ పిటిషన్‌ సర్వీస్‌, సెకండ్‌ అప్పీల్‌ తదితర కేసులున్నాయి. హైకోర్టులో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ బెంచ్‌లకు న్యాయమూర్తులు జస్టిస్‌ జి.శ్రీదేవి, జస్టిస్‌ సాంబశివరావునాయుడు, మాజీ హైకోర్టు న్యాయమూర్తి డా.జస్టిస్‌ జి.యతిరాజు నేతృత్వం వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని