Published : 27 Jun 2022 05:16 IST

రాష్ట్రంలో ఆయుర్వేద పార్కులు ఏర్పాటు చేయాలి

 మంత్రి హరీశ్‌రావుకు ఆ ఔషధాల తయారీదారుల సంఘం వినతి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఆయుర్వేద ఔషధాల తయారీ, పరిశోధనల కోసం కొత్త ఆయుష్‌ పార్కులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆయుర్వేద ఔషధాల తయారీదారుల సంఘం వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును కోరింది. ఈ మేరకు సంఘం కార్యదర్శి జీఆర్‌ కరుణాకర్‌ నేతృత్వంలో ప్రతినిధులు ఆదివారం మంత్రిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుల్లో ఆయుర్వేద కళాశాలలు, ఆసుపత్రులు, ఔషధాల తయారీ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని తెలిపారు. తెలంగాణలోనూ వాటిని  ప్రోత్సహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో రెండు ఆయుష్‌ పార్కుల ఏర్పాటు కోసం కృషి చేయాలని కోరారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వీటి ఏర్పాటు కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసిందని, దీనికి సమాధానంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త పార్కుల ప్రతిపాదనలు చేయాలని కరుణాకర్‌ అభ్యర్థించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని