Published : 27 Jun 2022 05:16 IST

తొలకరితోటే వారికి కష్టాలూ మొదలు

తొలకరి వర్షాలకు రైతులు సహా అందరూ సంతోషిస్తారు. కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం గుండి గ్రామ ప్రజలు సైతం వర్షాలతో బంగారు పంటలు పండుతాయని ఆనందిస్తున్నా.. ప్రతి పనికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి ఉండడం, అందుకోసం పెద్దవాగును దాటాల్సి రావడం వారిని భయపెడుతోంది. ఈ గ్రామం నుంచి నిత్యం 120 మంది విద్యార్థులు చదువులకు, వందల మంది ప్రజలు వివిధ పనులకు ఆసిఫాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. తాత్కాలిక రహదారి తొలి వర్షాలకే కొట్టుకుపోవడంతో ప్రజలు, విద్యార్థులు నడుము లోతు నీళ్లలో పెద్దవాగును దాటుతూ ఇలా కనిపించారు. ఈ వాగులో ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటే థర్మాకోల్‌ పడవలపై ప్రమాదకరంగా ప్రయాణిస్తుంటారు. ఈ వాగుపై నిర్మిస్తున్న వంతెన వివిధ కారణాలతో 14 ఏళ్లుగా పిల్లర్ల దశకే పరిమితమైంది.

  - ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌
                 

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని