కనిపించకుండా కబళిస్తున్నాయ్‌!

అనాథ పిల్లల్లో అనారోగ్య సమస్యల్ని ముందుగా గుర్తించి వెంటనే చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఛాయిస్‌ ఫౌండేషన్‌తో కలిసి వరంగల్‌, ఖమ్మం, సంగారెడ్డి, హైదరాబాద్‌, నారాయణఖేడ్‌, అచ్చంపేట, మెదక్‌,

Published : 28 Jun 2022 06:35 IST

అనాథ పిల్లల్లో అంతర్గత ఆరోగ్య సమస్యలు
ముందుగానే పసిగట్టి చికిత్స అందించాలి
ఛాయిస్‌ ఫౌండేషన్‌ సర్వేలో వెల్లడి

రాష్ట్రంలోని అనాథ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు పొంచిఉన్న ఆరోగ్య ఆపదలను గుర్తించి, సకాలంలో చికిత్స అందించాల్సిన అవసరముందని ఛాయిస్‌ ఫౌండేషన్‌ అభిప్రాయపడింది. చిన్నారుల్లో సగానికిపైగా పౌష్టికాహార లోపంతో ఉన్నారని తెలిపింది.

ఈనాడు, హైదరాబాద్‌: అనాథ పిల్లల్లో అనారోగ్య సమస్యల్ని ముందుగా గుర్తించి వెంటనే చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఛాయిస్‌ ఫౌండేషన్‌తో కలిసి వరంగల్‌, ఖమ్మం, సంగారెడ్డి, హైదరాబాద్‌, నారాయణఖేడ్‌, అచ్చంపేట, మెదక్‌, జనగామ, గజ్వేల్‌, సిద్ధిపేట జిల్లాల్లోని 24 అనాథ శరణాలయాల్లో చిన్నారులకు పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రతిచిన్నారికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆయా వివరాల్ని డిజిటల్‌ రూపంలో నిక్షిప్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు 946 మంది చిన్నారుల సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని ఛాయిస్‌ ఫౌండేషన్‌ సేకరించింది. వీరిలో ఎక్కువ మందికి పౌష్టికాహార లోపం, విటమిన్‌, దృష్టి, వినికిడి లోపాలు, మానసిక, దంత సమస్యలు ఉన్నాయని, ఎక్కువ మంది అంతర్గత ఆరోగ్య సమస్యలకు దగ్గర్లో ఉన్నారని వెల్లడైంది. అనాథ చిన్నారుల్లో 12 మందికి ఎక్సోమ్‌ సీక్వెన్సింగ్‌, జెనెటిక్‌ స్టడీస్‌ అవసరమని ఫౌండేషన్‌ సర్వేలో వెల్లడైంది. 128 మంది చిన్నారులకు ఎంఆర్‌ఐ, సీటీస్కానింగ్‌ చేయాలని పేర్కొంది.


మరో రెండున్నర నెలల్లో పూర్తి
- డాక్టర్‌ సతీష్‌ ఘంటా, డైరెక్టర్‌, ఛాయిస్‌ ఫౌండేషన్‌

రాష్ట్రంలోని అనాథ పిల్లలతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారుల ఆరోగ్య సమస్యల్ని అధ్యయనం చేస్తున్నాం. అనాథ పిల్లల్లో 185 మంది చిన్నారులకు అవసరమైన వైద్య చికిత్సను ఫౌండేషన్‌ అందిస్తోంది. వీరిలో ఒకటికన్నా ఎక్కువ ఆరోగ్య సమస్యలున్నవారున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని