గోదావరిపై మంచిర్యాల వద్ద బ్రిడ్జి

గోదావరిపై మరో వంతెన నిర్మాణానికి రంగం సిద్ధం అవుతోంది. మంచిర్యాల-రామగుండం పట్టణాల అనుసంధానంలో ఈ రహదారి వంతెన నిర్మాణం కీలక భూమిక పోషించనుంది. గోదావరిపై మంచిర్యాల- అంతర్గామ్‌ మధ్య 1.4

Published : 28 Jun 2022 05:36 IST

మంచిర్యాల-రామగుండం మధ్య రోడ్డుమార్గం

ఈనాడు, హైదరాబాద్‌: గోదావరిపై మరో వంతెన నిర్మాణానికి రంగం సిద్ధం అవుతోంది. మంచిర్యాల-రామగుండం పట్టణాల అనుసంధానంలో ఈ రహదారి వంతెన నిర్మాణం కీలక భూమిక పోషించనుంది. గోదావరిపై మంచిర్యాల- అంతర్గామ్‌ మధ్య 1.4 కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణానికి రహదారులు, భవనాల శాఖ టెండర్లు ఆహ్వానించింది. ఈ నిర్మాణం పూర్తయితే మంచిర్యాల, రామగుండంల మధ్య రాకపోకలు మరింత సుగమం అవుతాయి. ఆ రెండు పట్టణాల ప్రజల ఇబ్బందులు తొలగుతాయి. దీని నిర్మాణానికి రూ.164 కోట్ల వ్యయం అవుతుందన్నది అంచనా. టెండర్లు దాఖలు చేసేందుకు వచ్చే నెల అయిదో తేదీ తుది గడువుగా రహదారులు, భవనాల శాఖ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని