రాక్‌గార్డెన్‌ కబ్జాపై మంత్రి తలసాని ఆగ్రహం

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని రాక్‌గార్డెన్‌ ఆక్రమణపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తుంటే మీరేం చేస్తున్నారంటూ ఆయన రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 28 Jun 2022 05:36 IST

అధికారులతో సమీక్ష.. సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని రాక్‌గార్డెన్‌ ఆక్రమణపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తుంటే మీరేం చేస్తున్నారంటూ ఆయన రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రూ.300 కోట్ల భూమికి చెర’ శీర్షికతో ఈ నెల 26న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై ఆయన సోమవారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ ఆర్డీవోలు వసంతకుమారి, వెంకటేశ్వర్లు, షేక్‌పేట తహసీల్దారు రామకృష్ణ, ఖైరతాబాద్‌ జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌లతో మాట్లాడారు. స్థలానికి సంబంధించిన దస్త్రాలపై ఆరాతీశారు. ఎంతటివారైనా సరే.. ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నిస్తే ఉపేక్షించేది లేదన్నారు. కూల్చిన గోడను పునర్‌నిర్మించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతకుముందు అధికారులు రాక్‌గార్డెన్‌ను సందర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని